ట్రెండింగ్
Epaper    English    தமிழ்

26 అక్టోబరు, 2019 రాశి ఫలాలు మీకోసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 01:54 AM

 


మేషం:(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.


వృషభం:(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.


మిథునం:(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) గౌరవ మర్యాదలకు లోపముండదు.వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.


కర్కాటకం:(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.


సింహం:(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్ర్తిలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.


కన్య:(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి వుంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.


తుల:(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.


వృశ్చికం:(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మనస్సు చంచలంగా వుంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.


ధనుస్సు:(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.


మకరం:


(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటకు దూరంగా నుండుట మంచిది. ఔషధసేవ తప్పదు. స్థిరాస్తుల విషయాల్లో తొందరపాటు పనికిరాదు.


కుంభం: (ధ‌నిష్ట‌ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు


మీనం:(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa