కాలువపై ఉన్న ఫుట్‌పాత్ హఠాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై నడిచి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోగా, అనంతరం మరికొంత భాగం కూలడంతో మరో వ్యక్తి బాధితుడయ్యాడు. రాజస్థాన్ రాష్ట్రం సిరోహి పట్టణంలో జరిగిన ఈ ఘటన అధికారులపై విమర్శల దాడికి ఆయుధమైంది. సమీపంలోని సీసీ కెమెరాల్లో ఈ ఘటన నమోదు కావడంతో చూసిన వారు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అదృష్టవశాత్తు ఇద్దరి ప్రాణాలు దక్కాయని, నిర్మాణంలో నాణ్యత లోపాలే ఘటనకు కారణమని, ఇటువంటి నిర్మాణాలుంటే తొలగించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa