ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబరు 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 06:31 PM

డిసెంబరు 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.  ఈ మేర‌కు ఈ ఉత్సవాలకు ప్రభుత్వ నుంచి రూ.కోటి మంజూరు చేయనున్నట్లు సమాచారం.  ప‌ర్యాట‌క మంత్రి అవంతి శ్రీ‌నివాస‌రావు సార‌ద్యంలో గ‌తానికి భిన్నంగా ఈ సారి ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. త‌న ప్ర‌తిష్ట‌కు ఈ ఉత్స‌వాలు పెట్టిన‌ట్టు ఉండాల‌ని ఇప్ప‌టికే ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.  విశాఖ ప్రాంత విశిష్టతను తెలియజేసి తద్వారా పర్యాటకానికి ఆకర్షణ తీసుకుచ్చేందుకుగాను ఏటా ఈ ఉత్పవ్‌ను నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే..
ఈ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులకు, క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పించనున్నారు.  కైలాసగిరిపై ఎంవీఆర్డీఏ ఫ్లవర్‌ షో, ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, కార్నివాల్‌ ఏర్పాటు చేయనున్నారు.  బీచ్‌రోడ్డు, జాతర, వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కులో మూడు వేదికలను ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఉత్స‌వాల‌కు ముఖ్య అతిధిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కాగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన క‌ళాకారుల‌ను ఈ ఉత్స‌వ్‌కు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa