మేష రాశి (Aries) – ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. స్నేహితులతో కలిసి చాలా ప్లాన్లు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసి నచ్చిన విషయాలు మాట్లాడుకుంటారు. కుటుంబ సభ్యులతో గతం గురించి ప్రస్తావించి గొడవలు పెట్టుకోకండి.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు మీరు చాలా బద్ధకంగా ఉంటారు. పెద్ద పనేమీ చేయరు. మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని కుటుంబ సంబంధిత విషయాల్లో పాలు పంచుకోమని కోరతారు. కానీ మీరు మాత్రం అక్కడి నుంచి పక్కకి జరిగి మీ పని మీరు చేసుకుంటారు. మీ ఇబ్బందిని తొలగించేందుకు మెడిటేషన్ లేదా నచ్చిన పుస్తకం చదివేందుకు ప్రయత్నించండి.
మిథున రాశి (Gemini) – ఈ రోజు ఆఖరి నిమిషంలో జరిగే మార్పుల వల్ల మీ పనులు ఎక్కువవుతాయి. ఇతరులు చెప్పిన ప్రణాళికకు అనుగుణంగా పని చేయరు. అయితే వారిపై చిరాకు పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టండి. వారితో ఎక్కువ సమయం గడపండి.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీ పని నెమ్మదిగా సాగుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేసి ఇతరులను కలిసేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతారు. పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. అయితే వారితో పనికి సంబంధించిన విషయాలు చర్చించకండి.
సింహ రాశి (Leo) – ఈ రోజు మీ పెండింగ్ పని పూర్తి చేస్తారు. పని వాయిదా వేయాలని భావిస్తుంటారు కానీ సాయంత్రానికి పని పూర్తవ్వట్లేదని బాధపడతారు. మీకున్న ఆలోచనలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వారు మీ సాయం చేస్తారు. మీ భాగస్వామి మూడ్ అంతగా బాగోదు కాబట్టి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి.
కన్య రాశి (Virgo) – ఈ రోజు మీరు ఒక సమయంలో ఒక పనిపై ఫోకస్ పెట్టండి. హైపర్ గా ఆలోచించి పని పూర్తి చేయాలని ముందుకు వెళ్లిపోకండి. మీ చుట్టూ ఉన్నవారు మీలాగే ఆలోచించకపోవచ్చు. వారి పని వారిని చేసుకోనివ్వండి. మీరు అనుకున్నట్లు వారు చేయాలని భావించకండి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో వీలైంతన ఎక్కువ సమయం గడపండి.
తుల రాశి (Libra) – ఈ రోజు మీకు చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. రోజంతా విశ్రాంతి తీసుకుంటూ గడుపుతారు. స్నేహితులు, బంధువులను ఇంటికి ఆహ్వానించి వారితో సమయం గడుపుతారు. మీ భాగస్వామి కీలక నిర్ణయాల్లో మీ సలహా కోరుకుంటారు. సాయంత్రానికి మీరు చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. మీకు నచ్చిన పుస్తకం చదవడం, నచ్చిన వంట చేయడం వంటివి ప్రయత్నించండి.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు ఉదయం లేవడానికి కూడా చాలా అలసటగా ఫీలవుతారు. మీరు వెళ్లాల్సిన ఈవెంట్లు చాలానే ఉన్నా ఆఖరి నిమిషంలో వాటిని క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే మీ స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకు చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇతరులతో గొడవ పెట్టుకోకండి. డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవడం మంచిది.
ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పని మాత్రం కొద్దిగానే పూర్తవుతుంది. పాత స్నేహితులను కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఆఖరి నిమిషంలో వచ్చే ప్లాన్ మార్పుల వల్ల మీరు చాలా చిరాగ్గా ఫీలవుతారు. అయితే ఫలితం మీద ఫోకస్ పెట్టండి. పని గురించి స్నేహితులతో మాట్లాడడం తగ్గించండి.
మకర రాశి (Capricorn) – ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. బంధువులతో కలిసి సమయం గడుపుతారు. కుటుంబంలో ఓ సభ్యుడి వల్ల మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. అయితే సాయంత్రానికి మామూలుగా మారిపోయి మీ జీవితం, మీ ప్లాన్ల గురించి పనిచేయడం ప్రారంభిస్తారు. ఉన్న సమస్యలను పెద్దగా ఊహించుకోవడం తగ్గించండి.
కుంభ రాశి (Aquarius) - ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ గా నిలుస్తారు. కానీ ఒత్తిడిలో మీరు ఇతరుల మీద చిరాకు పడతారు. అయితే ఇతరుల పాయింట్ నుంచి చూడడం గుర్తించండి. సాయంత్రం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రవర్తన వల్ల స్నేహితులు ఇబ్బంది పడతారు.
మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు ఎంత విశ్రాంతి తీసుకున్నా మీరు ఇంకా అలసటగానే ఫీలవుతుంటారు. ఈ రోజు మీ పని అస్సలు పూర్తవ్వదు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు. స్నేహితులు కలిసి గడిపేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. తప్పక వెళ్లండి. గతం గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa