టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆస్ట్రేలియా విభాగం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్‌లో పసుపుబోర్డును త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టెర్రరిజంపై మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచ సదస్సులో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించడానికి వచ్చిన మంత్రిని సదస్సు అనంతరం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నిజామాబాద్ పసుపుబోర్డు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చేదిశగా ఓ తెలంగాణ బిడ్డగా పోరాడాలని వారు విన్నవించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa