బుల్‌బుల్ తుఫాన్ వల్ల బెంగాల్ సహా ఒడిషాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బీభత్సమైన ఈదురు గాలులు వీచడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అదేవిధంగా హుగ్లీ, హావ్‌డా, దక్షిణ 24 పరగణాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు వారిని హిచ్చరిస్తున్నారు. రాత్రి 8 గంటలకు సాగర్ ద్వీపం వద్ద తుఫాను తీరం దాటినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిపేశారు. ఈ తుఫాన్ వల్ల బంగ్లాదేశ్‌కు కూడా ముప్పు పొంచి ఉన్నది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశముండడంతో ముందు జాగ్రత్తగా 18 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa