మేషం: ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం చేసినా శుభం చేకూరుతుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.
వృషభం: చేపట్టిన పనులలో అనుకోని అవాంతరాలు, చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మనోభావాలను బయటికి వ్యక్తం చేయకండి. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు కలసివచ్చే కాలం. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ధనం ఏ మాత్రం పొదుపు చేయకున్నా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు.
మిథునం: కుటుంబంలో నెలకొన్న అనిశ్చితి, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలలో మెలకువ వహించండి. నూతన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాల్చుతాయి. బంధువులతో విబేధాలు తొలగిపోతాయి.
కర్కాటకం: శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సాయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. పనులు కాస్త మందగిస్తాయి. రాబడికి మించి ఖర్చులు అధికం అవుతాయి.
సింహం: ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరాశపరిచే వీలుంది. కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవిస్తారు. వారి సలహాలను స్వీకరిస్తారు. బంధాలను నిలుపుకునేందుకు తాపత్రయపడతారు. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతైనా పోరాడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కన్య : వృత్తి వ్యాపారాలు ఆశాజనకం. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్‌లో రాణింపు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక మనస్పర్థలు రావచ్చు. స్త్రీలు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అధిక మొత్తంలో రుణం చేయాల్సి వస్తుంది. క్రయ విక్రయ రంగంలోని వారికి మెలకువ అవసరం.
తుల: ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. వస్త్ర, బంగారు, వెండి రంగాలలోని వారి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. ఆత్మీయులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు.
వృశ్చికంకోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక చింతన, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. శుభవార్తలు వింటారు.
ధనస్సు: స్పెక్యులేషన్ రంగాల వారికి నిరుత్సాహం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినివ్వవు. సంఘంలో పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొత్త అనుభూతికి లోనవుతారు.
మకరం : ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు అధికమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలలో మెలకువ వహించండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. ఏదయినా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
కుంభం : పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి.
మీనం: కొన్ని విషయాలలో మీ ప్రమేయం లేకున్నా మాటపడాల్సి వస్తుంది. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa