దైవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడని పాకిస్తాన్ తమ దేశానికి చెందిన ఓ ప్రొఫెసర్‌కు శనివారం కోర్టు మరణ శిక్ష విధించింది. 2013లో ప్రొఫెసర్ జునైద్ హఫీజ్ ఖాన్ ముల్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ దైవదూషణ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణపై కేసు దాఖలైంది. అప్పటి నుంచి ప్రొఫెసర్‌ను బయట సమాజంలో ఉంటే ప్రాణాలకు ప్రమాదమంటూ నిర్భందంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయి శనివారం తీర్పు వెలువడింది. మరణ శిక్షతో పాటు 5 లక్షల పాకిస్తాన్ రూపాయలను కోర్టు జరిమానా విధించింది. ఈ తీర్పుపై ప్రొఫెసర్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. తన క్లయింట్‌కు చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ దోషిగా తేల్చారని, తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa