ఇండియన్ ఆర్మీ మేజర్ అనూప్ మిశ్రా కు… ఆర్మీ డిజైన్ బ్యూరో ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. సోమవారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేతుల మీదుగా ఈ అవార్డును అనూప్ మిశ్రా అందుకున్నారు. స్నైపర్ బుల్లెట్ల నుంచి ప్రాణ రక్షణ కల్పించేందుకు సర్వత్ర బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అనూప్ మిశ్రా డెవలప్ చేశారు. దేశీయంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను డెవలప్ చేసినందుకు అతనికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎల్వోసీ, కాశ్మీర్ లోయలో స్నైపర్ ఘటనలు ఎక్కువ కావడం వల్ల మేజర్ అనూప్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa