ఏపీ రాజధాని అమరావతిని మార్చాలంటూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం తగదని శాసనమండలి సభ్యుడు పి . వి . ఎన్ . మాధవ్ విమర్శించారు . బీజేపీ నగర కార్యాలయంలో ఆయన్ని రాజధాని ప్రాంత గ్రామాల రైతులు కలిశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి మార్చటం సరైన విధానం కాదని పేర్కొన్నారు . భూసమీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని , ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని కొల్పోతే అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు . భవిష్యత్తులో భూములు ఇవ్వాలంటేనే రైతులు భయపడాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు . రాజధాని నిర్మాణానికి రైతులు 38వేల ఎకరాల భూమిని ఇచ్చారని , వారందరికీ బిజెపి అండగా ఉంటుందని స్పష్టం చేశారు . రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కన పెట్టి రాజధాని పైనే చర్చ చేయటం అభివృద్ధికి విఘాతమని పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించినట్లుగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa