అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఇటీవల మంత్రిమండలిలో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత గవర్నర్ ప్రసగించారు. పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూల్, చట్ట సభలను అమరావతిలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మూడు రాజధానులపై మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa