ఒడిశాలోని ఏవోబీలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టులకు హంతల్‌గూడ వాసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో మావోయిస్టులపై హంతల్‌గూడ ప్రజలు రాళ్లతోదాడి చేశారు. ఈ ఘటనలో గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు హడ్మా మృతి చెందగా, నందపూర్ ఏరియా కమిటీ సభ్యుడు జిప్రోకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందవలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa