మే 29న జరిగిన ఎనుగు ఘటన చివరకు మేనకా గాంధీపై కేసుకు దారిసింది. ఆ ఘటనకు మేనకాకు ఎలాంటి సంబంధం ఉంది అని అనుకుంటున్నారు. అయితే ఈ కథనం చదవండి. బుధవారం మేనకా గాంధీ ట్విటర్ లో ఏనుగు ఘటనై స్పందించారు. ‘‘మలప్పురం జిల్లాలో జంతువులపై అమానుషంగా ప్రవర్తించే నేర ప్రవృత్తి ఎక్కువ. ఇప్పటివరకు ఒక్క నేరస్తుడిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా అయితే వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు’’ అని ట్వీట్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో మలప్పురం జిల్లా వాసులను కించపరిచేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆ జిల్లాకు చెందిన సుభాష్ చంద్రన్ అనే అడ్వకేట్ గురువారం మేనకాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏనుగు ఘటన పాలక్కడ్ జిల్లాలో జరిగితే కొందరు మలప్పురం జిల్లాలో జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు కొంతమంది మతం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాపై సోషల్ వేదికగాలో దుష్ప్రచారం చేయడంపై మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ మలప్పురం జిల్లాపై, జిల్లా వాసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa