ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన నెల రోజులకే..నవ వధువు...

national |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 12:49 PM

ఎన్నో కలలతో మెట్టింనిట అడుగు పెట్టిన ఆ యువతికి నిరాశే ఎదురైంది. పెళ్లైన నెలకే ఆమెకు నిండు నూరేళ్లు నిండాయి. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో భరించలేక తాను తనువు చాలించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని మైసూర్ ఆనందనగర్ కు చెందిన భావనకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజయ్ తో నెల క్రితం వివాహం జరిగింది. అజయ్ కి పెళ్లికి ముందు నుంచే మరో యువతితో పరిచయం ఉంది. ఆ యువతి,అజయ్ సాన్నిహిత్యంగా గడిపిన ఫోటోలు అజయ్ ఫోన్లో ఉన్నాయి. వాటిని భావన చూసి అజయ్ ని నిలదీసింది. ఇరు కుటుంబాల పెద్దలకు ఈ విషయం తెలిసింది. పెద్దలు రాజీ కుదిర్చి కాపురం చేసుకోవాలని సర్ది చెప్పారు. అయినా భర్తలో మార్పు లేకపోవడంతో భావన తీవ్ర మనోవేదన చెందింది. శుక్రవారం తన ఇంట్లోనే ఉరేసుకొని భావన ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వారి కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. పెళ్లైన నెలకే భావన మరణించడం అందరిని కలిచి వేసింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa