ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 12:51 PM

సివిల్స్‌ 2020కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం 2020, అక్టోబర్‌ 4న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అలాగే 2021, జనవరి 8న మెయిన్స్‌ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2021, ఫిబ్రవరి 28న జరుగుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షనే మే 31 నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలాగే 2019 ఏడాదికి సంబంధించి నిర్వహించాల్సిన పర్సనాలిటీ టెస్టులు 2020, జులై 20 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. వీరికి వ్యక్తిగత సమాచారం అందించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ప్రిలిమినరీ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.


మిగతా పరీక్షల తేదీల వివరాలు కూడా అందించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎన్డీయే అండ్ ఎన్ఏ (1, 2)పరీక్షలు – సెప్టెంబర్‌ 6


ఐఈఎస్/ ఐఎస్ఎస్ పరీక్ష – అక్టోబర్ 16


కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ – అక్టోబర్ 22


సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు – అక్టోబర్ 4, 2020


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ప్రిలిమినరీ)- అక్టోబర్ 4, 2020


సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలిస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్- డిసెంబర్ 20


సివిల్స్ మెయిన్ పరీక్ష – జనవరి 8, 2021


ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(మెయిన్) పరీక్ష- ఫిబ్రవరి 28, 2021






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa