కేంద్రం 'వన్ నేషన్ వన్ కార్డ్' వ్యవస్థను ప్రభుత్వం అమలు చేసింది. దీని ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఇంకా రేషన్ కార్డు లేకపోతే, మొబైల్ ద్వారా సులభంగా రేషన్ కార్డును పొందొచ్చు. ఇంకా రేషన్ కార్డ్ లేకపోతే, మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. మీరు ఆయా రాష్ట్రం వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో రెండు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. ఒకటి బిపిఎల్ కేటగిరీ, మరొకటి నాన్ బిపిఎల్ కేటగిరీ. ఆదాయం ప్రకారం, మీరు ఏ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలో ఎంచుకోవచ్చు. మొదట మీ రాష్ట్రంలోని అధికారిక సైట్‌ను తప్పక సందర్శించాలి. రేషన్ కార్డు జారీకి ఆధార్ కార్డు, ఓటరు ఐడి, పాస్‌పోర్ట్ ఐడి ప్రూఫ్‌గా ఇవ్వవచ్చు. ఆయా కార్డులు లేకపోతే, ప్రభుత్వం జారీ చేసిన కార్డులతో పాటు, హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వవచ్చు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడంతో పాటు ఐదు నుంచి 45 రూపాయల రుసుము చెల్లించాలి. దరఖాస్తు సమర్పించిన తరువాత, ఫీల్డ్ ధృవీకరణ అధికారులు వస్తారు. అధికారి ఫారంలో నింపిన సమాచారాన్ని పరిశీలించి ధృవీకరిస్తాడు. ఈ ప్రక్రియ దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు పూర్తవుతుంది. విచారణ పూర్తి అయిన తర్వాత రేషన్ కార్డు 30 రోజుల్లోపు ఇస్తారు. దరఖాస్తుదారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ సేవా కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa