క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఆనందాన్నిచ్చే ఐపీఎల్... బీసీసీఐకు ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దశాబ్దానికి పైగా ఐపీఎల్ నిర్వహిస్తున్న బీసీసీఐ... ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించే విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక దశలో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ కుదరకుంటే విదేశాల్లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించిన చరిత్ర సైతం ఉంది. అలాంటి కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడడం... బీసీసీఐకి చాలా ఇబ్బందిగా మారింది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకు రూ. 3500 కోట్ల నష్టం వచ్చే ప్రమాదం ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే ఆ తర్వాత బీసీసీఐ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమన్నారు. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర అధ్యయనం చేయనున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa