కేంద్ర ప్రభుత్వం సడలింపులతో లాక్ డౌన్ 5ను జూన్ 30 వరకు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సర్కార్ కూడా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అవి జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
65 ఏళ్లు పైబడిన వృద్దులు,10 సంవత్సరాలలోపు చిన్నారులు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు.
షాపింగ్ మాల్స్ లలో ఏసీలు 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపు ఉండాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం.
కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్,హోటళ్లు,రెస్టారెంట్లకు అనుమతి. ఆహారం పార్శిల్ ఇచ్చేందుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అనుమతి ఉన్న షాపింగ్ మాల్స్,హోటళ్లు,రెస్టారెంట్లు డిజిటల్ చెల్లింపులు,ఈ వ్యాలెట్ సౌకర్యం కల్పించాలి.
షాపింగ్ మాల్స్,పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ చేపట్టాలి.
ఫుడ్ కోర్టులు,రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి.
హోటళ్లు,రెస్టారెంట్లలోని టేబుళ్లను వినియోగదారుడు మారిన ప్రతి సారి శానిటైజ్ చేయాలి.
షాపింగ్ మాల్స్ లోని సినిమా హాళ్లు తెరవకూడదు.
ఆట ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మూసి ఉంచాలి.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలు అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలి.
దేవాలయాల్లో పాటించాల్సిన నియమాలు ఇవి
దేవాలయాలు,ధార్మిక పరిషత్ లకు అనుమతి.
దేవాలయాలు,మాల్స్,రెస్టారెంట్ల వద్ద ప్రజలు గుమికూడడం పై నిషేధం. అక్కడ ఖచ్చితంగా క్యూ పద్దతి పాటించాలి.
దేవాలయాల్లో విగ్రహాలు,పవిత్ర గ్రంథాలు ముట్టుకోవడం నిషేధం.
తీర్ద ప్రసాదాలు అందజేయడం, పవిత్ర జలాలు భక్తుల పై చల్లడం నిషేధం.
ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa