ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుబాబులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 04:39 PM

ఢిల్లీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మందుబాబులకు ‘కిక్కు’ ఇచ్చింది. కరోనా సేవల కోసం అంటూ మద్యం ఎమ్మార్పీపై 70 శాతం పన్నును విధించాలని ఇటీవల ఆ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఆ పన్నను ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది. మరో రెండ్రోజులు ఆగితే... ఇప్పుడు కొనే మద్యాన్ని దాదాపు సగం ధరకే వినియోగదారులు పొందొచ్చు. అన్ని రకాల మద్యం బాటిళ్లకూ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోవడంతో... మే 5న ప్రభుత్వం ఈ కొత్త పన్నును తీసుకువచ్చింది. ఇక మద్యం కనుగోళ్లకు ఈ కూపన్.. ఢిల్లీలో ప్రజలు లిక్కర్ షాపుకి వెళ్లాలంటే ఇక నుంచి ఈ-కూపన్ తీసుకోవాల్సిందే. ఈ ఈ-కూపన్ కారణంగా... కస్టమర్ ఏ టైంకు మద్యం షాపుకి వెళ్లాలో టైమ్ స్లాట్ ఉండనుంది. సరిగ్గా ఆ సమయంలో వెళ్లడం వల్ల కరోనా టెన్షన్లు లేకుండా సోషల్ డిస్టెన్స్ లో మద్యం కొనుక్కునే ఛాన్స్ ఉంది. అందువల్ల ప్రభుత్వం ఈ-కూపన్ విధానాన్ని మాత్రం కొనసాగించనుంది.


ఏపీ ప్రభుత్వం తగ్గిస్తుందా?


ఏపీ ప్రభుత్వం కూడా కరోనా సమయంలో మద్యం ధరలను విపరీతంగా పెంచింది. ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం ధరలను తగ్గించడంతో ఏపీ ప్రభుత్వం కూడా ధరలను తగ్గిస్తుందా లేదా అన్న అంశంపై చర్చ సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa