ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 04:41 PM

కరోనా వైరస్ నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. లాక్‍‌డౌన్ సడలింపులు విషయంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. కేంద్రం నిబంధనలకు మినహాయింపులు ప్రకటించిన వెంటనే వాటిని అమలు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని ఆ ప్రభుత్వం తీసుకుంది. ఇక నుంచి ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించాలనుకునే వారిపై ఆంక్షలను తొలగించింది. చెక్ పోస్టుల దగ్గర వారికి ఇక ఎలాంటి తనిఖీలు ఉండవు. అసలు సరిహద్దు చెక్ పోస్టులే ఇక కనిపించవు. సోమవారం నుంచి ఆ చెక్ పోస్టులను ఎత్తేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూన్ 8 నుంచి ఏపీ ప్రభుత్వం... సరిహద్దులను తెరిచేస్తోంది. దీంతో రేపటి నుంచి ఏపీ టూ తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకీ లాక్ డౌన్ కు ముందులాగే హ్యాపీగా వెళ్లిపోవచ్చు. క్వారంటైన్లూ, తనిఖీల లాంటివి ఏమీ ఉండవు. ప్రభత్వ నిర్ణయంతో ఇన్నాళ్లు తెలంగాణాలో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలకు ఊరట లభించనుంది. ఎలాంటి అనుమతులు, నిబంధనలు లేకుండానే వారు తమ సొంత ప్రాంతాలకు చేరవచ్చు. ప్రభుత్వం నిబంధనలు సడలించింది కదా అంటూ అజాగ్రత్తగా ఉంటే మాత్రం కరోనా బారిన పడే ప్రమాదం ఉందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa