ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలస కార్మికుడికి పాము కాటు.. కరోనా భయంతో సాయం చేయని గ్రామస్తులు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 03:01 PM

కరోనా భయం అందర్నీ వెంటాడుతోంది. ఆ భయంతోనే చాలా మంది సాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. తాజాగా పాము కాటుకు గురైన వలస కార్మికుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సకాలంలో చికిత్స అందకపోవడంతో అతడు చనిపోయాడు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌లో ఈ ఘటన చోటచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు..దిలీప్ పండిట్ (60) అనే వ్యక్తి ఇటీవలే మహారాష్ట్ర నుంచి స్వస్థలానికి తిరిగొచ్చాడు. గ్రామస్థులు ఊళ్లోకి రానీయకపోవడంతో సౌత్ దినాజ్‌పూర్ జిల్లా పరిషత్ కాంప్లెక్స్‌లో ఓ గదిలో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఉన్నట్టుండి అపస్మారక స్థితిలో వెళ్లాడు. అతడితో పాటు ఉన్న మిత్రుడు వెంటనే గ్రామంలోకి వెళ్లి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్దామని అడిగాడు. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతిచెందాడు. పోస్టుమార్టం రిపోర్టులో అతడు పాము కాటుతో చనిపోయినట్లు తెలిసింది. ఆస్పత్రికి కాస్త ముందు వచ్చి ఉంటే అతడు బతికే అవకాశముండేదని డాక్టర్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa