ఆయన బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి. అన్యాయం,అక్రమం జరిగితే అడ్డుకోవాల్సింది పోయి అతనే దారుణానికి పాల్పడబోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు అమరావతిలోని లాడ్జికి వచ్చారు. లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అమరావతి ఎస్సై రామాంజనేయులు డ్రైవర్ కృష్ణతో కలిసి లాడ్జికి వచ్చాడు. ఆ జంట వద్దకు వెళ్లి రూ.10 వేలు ఇవ్వాలని లేకపోతే వ్యభిచారం కింద కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ వారు అంత డబ్బు లేదని రూ.5 వేలు ఇస్తామన్నారు. తమ వద్ద ఉన్న నగదు 3 వేల రూపాయలు ఇచ్చారు. మరో 2 వేలు ఏటిఎం నుంచి డ్రా చేసి ఇస్తామని తెలిపారు. దీంతో డ్రైవర్ కృష్ణ,జంటగా వచ్చిన వ్యక్తిని ఎస్సై ఏటీఎంకు పంపాడు. ఒంటరిగా ఉన్న మహిళతో ఎస్సై రామాంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో షాకైన మహిళ ఏం చేయాలో అర్దం కాలేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బు తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో బాధితులు మంగళవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణలో నిజాలు తేలడంతో ఎస్సై రామాంజనేయులు పై సస్పెన్షన్ వేటు వేశారు. డ్రైవర్ కృష్ణ పై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa