ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధుమేహ రోగులు ఎక్కువగా ఈ పండ్లు తింటే మంచిది...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 10, 2020, 02:33 PM

కూరగాయలతో పోలిస్తే శరీరానికి అవసరమైన లవణాలు, విటమిన్లు, పీచు పదార్థం పండ్ల ద్వారానే ఎక్కువగా లభిస్తాయి. అయితే, వీటిలో కార్పోహైడ్రేట్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మధుమేహ రోగులు ఏ పండ్లు ఎక్కువగా తినవచ్చో తెలుసుకుందాం...


యాపిల్‌: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్ కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.


జామకాయ: ఇది డయాబెటిస్ కు మంచి ఔషదం. ఇది అధిక మొత్తంలో ఫైబర్లను కలిగి ఉండి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.


నేరేడు: నేరేడు పండ్లు రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. నేరేడు పండులోని గింజల్ని పొడి చేసి రోజూ తీసుకున్నా షుగర్ నియంత్రణలోకి వస్తుంది.


అంజీర: ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్‌ సక్రమంగా పనిచేసేందుకు ఇది తోడ్పడుతోంది.


చెర్రీస్‌: వీటిలో ఉండే విటమిన్ సి, ఐరన్, బీటా కెరోటిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఆంథోసియానిన్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని 50 శాతానికి పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.


బొప్పాయి: ఇందులో హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి డయాబెటిస్ రోగులను రక్షించే ఎంజైములు ఉంటాయి. బొప్పాయిలో ఉండే ప్లెతోరా న్యూట్రియంట్స్ మధుమేహాన్ని నివారిస్తాయి. డయాబెటిస్ వల్ల ఏర్పడే గుండె సమస్యలను అడ్డుకుంటాయి.


బెర్రీస్‌: రాస్‌ బెర్రీస్, స్ట్రాబెర్రీస్‌, బ్లాక్ బెర్రీస్, క్రాన్‌ బెర్రీస్‌ షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. రక్తంలోని చక్కర నిల్వలను ఇవి క్రమబద్ధీకరిస్తాయి.


దానిమ్మ: రక్తంలోని చక్కెరను నియంత్రించే శక్తి దానిమ్మలో ఉంది. ఫ్రక్టోజ్‌, పీచు పదార్థంలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ను బాగా తగ్గించే గుణం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa