భారత్-నేపాల్ సరిహద్దుల్లో దారుణం జరిగింది. సీతామర్హి ఏరియాలో భారత్‌కు చెందిన రైతులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సశస్త్ర సీమాబల్‌కు చెందిన బీహార్ సెక్టార్ ఐజీ ఈ ఘటనను ధృవీకరించారు. కాగా, ఈ కాల్పులు ఎవరు జరిపారు అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే, నేపాల్ వైపు నుంచి జరిగిన కాల్పులవల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఘటనపై విచారణ జరుపుతామని అర్మీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa