రెండో భార్య దగ్గర ఉంటున్న భర్తను కిడ్నాప్ చేసిన మొదటి భార్య. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు హాసన్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..రోమా అనే మహిళ తన భర్త షాహిత్ షేక్ తో కలిసి మరాతహళ్లిలో ఉంటోంది. కానీ షాహిత్ మొదటి భార్యను వదిలేసి ఏడాది క్రితం రత్నా ఖాతుమ్ అనే మహిళలను రెండో పెళ్లి చేసుకుని విశ్వేశ్వరయ లేఅవుట్లో ఆమె దగ్గరే ఉంటున్నాడు. రోమాను పూర్తిగా వదిలేశాడు. నగలు..డబ్బు అంతా ఖాతుమ్ కే ఇచ్చేశాడు.
తనను తన మానాన వదిలేసి చక్కగా రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఎలాగైనా సరే తన దగ్గరకు తెచ్చుకోవాలని రోమా ఆశపడింది. ఎంత ప్రయత్నించినా తనభర్త తన దగ్గరకు రాకపోవటంతో భర్తకు కిడ్నాప్ చేయాలనుకుంది. దీంతో ఐదుగురు వ్యక్తులను నియమించుకుంది. వారికి రూ.2 లక్షలు కూడా ఇచ్చింది. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం జూన్ 7 న మధ్యాహ్నం 1 గంటలకు షాహిద్ కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు కిడ్నాప్ కూడా చేశారు. తరువాత భరత్ ఫామ్ హౌస్ కు తరలించి బందించారు. అలా బంధించిన తరువాత షాహిత్ పెనుగులాడుతూ..తప్పించుకోవటానికి యత్నించటంతో కిడ్నాపర్స్ అతని కొట్టి పడేశారు.
ఈక్రమంలో తన భర్త కనిపించట్లేదని రత్నా ఖాతుమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాహిత్ కోసం గాలిస్తుండగా..ఎట్టలకూ షాహిత్ ను గురువారం (జూన్ 11,2020)న పట్టుకున్నారు. విషయం తెలుసుకుని కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిని పట్టుకున్నారు.దీనిపై డిప్యూటీ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ..షాహిత్ ను అతని మొదటి భార్య కిడ్నాప్ చేయించిందని..ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని మిగిలిన వారంతా పరారీలో ఉన్నారని తెలిపారు.పరారీలో ఉన్నవారు 26 ఏళ్ల అభిషేక్, 25 ఏళ్ల భరత్, 22 ఏళ్ల ప్రకాశ్, చాలువ మూర్తిలుగా గుర్తించామని వారిని త్వరలోనే పట్టుకుంటామని..షాహిత్ మొదటిభార్య కూడా పరారీలో ఉందని ఆమెను కూడా పట్టుకుంటామని తెలిపారు.రోమా షేక్ తన భర్తను తిరిగి పొందాలనేఆలోచనతోనే ఈ కిడ్నాప్ చేయించిందని తెలిపారు. భర్తను కిడ్నాప్ చేయటానికి సదరు బృందం రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ రోమా వారితో బేరాలాండి రూ.2లక్షలకు బేరం కుదుర్చుకుందని..షాహిత్ ను కిడ్నాప్ చేశాక కిడ్నాపర్లు అతనిపై దాడి కూడా చేశారని అతనికి గాయాలు కావటంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa