ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రతినిధుల తర్వాత మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అసెంబ్లీ లోపల, బయట జరిగే ఘటనలను మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తారు. అయితే ఈ సారి మీడియా ప్రతినిధులకు అసెంబ్లీ మీడియా ప్రతినిధులకు అనుమతి లేదని ప్రభుత్వం నిర్ణయించింది. మీడియా పాయింట్ వద్ద మీడియా కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, శాసనసభ, శాసనమండలిలో మీడియా గ్యాలరీకి మాత్రం ప్రతినిధులను అనుమతిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 16న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఆన్లైన్ లోనే ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa