ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 10:33 AM

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కఠినంగా లాక్ డౌన్ అమలు చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలకు వైసీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ సారి ఏకంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. దీంతో లాక్ డౌన్‌పై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ నెల 17వ తేదీ నుంచి కర్ణాటకలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. మొదట పరిమిత సంఖ్యలో 168 బస్సులను నడపనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటకకు వెళ్లే బస్సులను 4 దశల్లో 500కు పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.ఇవాళ నుంచి ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ నెల 17 నుంచి బస్సులు తిరుగుతాయని తెలిపింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa