తమిళనాడులోని 4 జిల్లాల్లో మరోసారి లాక్ డౌన్ విధించారు. జూన్ 19 నుంచి జూన్ 30 వరకు ఈ లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. చెన్నై,చెంగల్ పట్టు,తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి మద్యాహ్నాం 2 గంటల వరకు నిత్యావసర సరుకులకు అనుమతించనున్నారు. ఈ 4 జిల్లాలకు ప్రజా రవాణాను నిషేధించారు. రోజు రోజుకు ఈ జిల్లాలలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa