ఓ ట్రక్కు, రెండు ఆటోలను ఢీకొనడంతో ఏడుగురు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్‌లోని గయా జిల్లా బిష్ణుగంజ్ గ్రామం సమీపంలో రెండు ఆటోల్లో కొంతమంది రెగానియా ప్రాంతంలో ఓ వేడుకకను హాజరయ్యారు. గయా నుంచి ఔరంగాబాద్ వైపు తిరిగి వస్తుండగా జీటీ రహదారిపై ఓ ట్రక్కు వేగంగా వచ్చి రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa