చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా తయారుచేసిన రూ.9 లక్షల రూపాయలు విలువగల బడదోస్త్ మిని లారీని ఆ సంస్థ సిఈవో శ్రీ నిథిన్ సేథ్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేరకు లారీ రికార్డులను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీ గోవింద హరి, డిఐ శ్రీ మోహన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa