ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సిక్కిం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 06, 2017, 07:04 PM

పశ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వంపై సిక్కిం స‌ర్కార్ సీరియ‌స్ అయింది. ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నో ఏళ్ల నుంచి గుర్ఖాలాండ్ ప్రజలు ప్రత్యక రాష్ట్రం కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారు ఎన్నోసార్లు రోడ్ల‌పైకి వ‌చ్చి ప్ర‌భుత్వ, ప్రైవేటు ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. ఆ ప్రాంతానికి ప‌క్క‌నే ఉన్న సిక్కింకి ఆ ఉద్యమం వ‌ల్ల ఎంతో న‌ష్టం జ‌రిగింది. త‌మ రాష్ట్రానికి 60 వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని ప్ర‌క‌టించిన ఆ రాష్ట్ర స‌ర్కార్‌... దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 32 ఏళ్లుగా గుర్ఖాలాండ్‌ ఉద్యమం జరుగుతుందని పేర్కొన్న సిక్కిం ప్ర‌భుత్వం.. వారు రోడ్ల‌పైకి వ‌చ్చిన ప్ర‌తిసారి తమ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని తెలిపింది. ఈ కాలంలో త‌మకు ఇంత‌గా న‌ష్టం వ‌చ్చిందని తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa