అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు దినకరన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. విదేశీ కంపెనీలకు అక్రమంగా డబ్బును తరలించారనే కేసులో విచారణను నిలిపి వేయాలంటూ కోర్టులో దినకరన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ప్రస్తుతం జరుగుతున్న విచారణపై స్టే విధించింది. తమ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు విచారణను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa