ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌, విజయసాయిరెడ్డిల‌పై సీబీఐ కోర్టు ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 07, 2017, 02:35 PM

అక్రమాస్తుల కేసులో విచార‌ణ‌ను ఎదుర్కుంటున్న వైసీపీ అధినేత‌ జగన్మోహ‌న్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల‌పై ఈ రోజు సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉన్న స‌ద‌రు నేత‌లు గుంటూరులో త‌మ పార్టీ నిర్వ‌హిస్తున్న‌ ప్లీనరీ సమావేశం నేప‌థ్యంలో హాజ‌రుకాలేక‌పోయారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ వారి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ కోర్టు.. రాజకీయ కారణాలతో విచార‌ణ‌కు డుమ్మా కొట్ట‌డం సరికాదని పేర్కొంది. ఇటువంటిది మ‌రోసారి జ‌రిగితే వారెంటు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కేసులో త‌దుప‌రి విచారణను ఈ నెల 21కి వేస్తున్న‌ట్లు వెల్లడించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa