బెర్లిన్ : చైనాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న జి20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిన్‌పింగ్ అధ్యక్షతన బ్రిక్స్‌లో మరింత ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్ శాంతికాముక దేశమని, ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గంలోనే పయనించాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa