తిరుమల : తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. నంద్యాలకు చెందిన భక్తులు శ్రీవారికి మొక్కులు చెల్లించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa