ఉత్తరప్రదేశ్ మీరట్ లోని ఓ స్కూల్లో బీఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె వీరంగం సృష్టించారు. స్కూల్లోకి కొరడాతో ప్రవేశించిన ఆమె….విద్యార్ధినులను కొరడాతో ఇష్టారీతిన చితకబాదారు. దీంతో స్టూడెంట్స్ భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందనేది ఇంకా తెలియరాలేదు. అయితే దాడికి పాల్పడ్డ మహిళ తండ్రి బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హజీ యాకుబ్ ఖురేషీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa