రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 241 ఖాళీలున్నాయి. జనరల్-113, ఓబీసీ-45, ఈడబ్ల్యూఎస్-18, ఎస్సీ-32, ఎస్టీ-33 పోస్టుల్ని కేటాయించారు. హైదరాబాద్‌లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల ఎక్స్-సర్వీస్‌మెన్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
మొత్తం 241 ఖాళీలు ఉండగా అందులో అహ్మదాబాద్ - 7, బెంగళూరు - 12, భోపాల్ - 10, భువనేశ్వర్ - 8, చండీగఢ్- 2, చెన్నై - 22, గౌహతి - 11, హైదరాబాద్ - 3, జైపూర్ - 10, జమ్మూ - 4, కాన్పూర్ - 5, కోల్‌కతా - 15, లక్నో - 5, ముంబై - 84, నాగ్‌పూర్ - 12, న్యూ ఢిల్లీ - 17, పాట్నా -11, తిరువనంతపురం - 3 పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థి ఎక్స్-సర్వీస్‌మెన్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.50. ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి రూ.27,678 వేతనం లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa