కరోనా క్రీడా రంగంపై కూడా ప్రభావం చూపుతోంది. తాజాగా వైరస్ కారణంగా ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ వాయిదా పడింది. ఈ మేరకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సోమవారం ప్రకటన చేసింది. టోక్యో ఒలింపిక్స్ దిశగా సన్నద్ధమవుతున్న భారత షట్లర్లకు ఈ నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేసింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 11న దేశ రాజధానిలో ఈ టోర్నీ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ విజృంభణ కారణంగా వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa