వీధికుక్కల దాడిలో ఓ చిన్నారి బాలిక తీవ్రంగా గాయపడింది. 12 కుక్కలు రెప్పపాటులో ఎటాక్ చేసి నానా బీభత్సం సృష్టించాయి. భయంతో ఆ చిట్టితల్లి చేసిన ఆర్తనాదాలు అందరినీ కలచివేసింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో జరిగింది. ఓ చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. రోడ్డుపై ఉన్న కుక్కల గుంపు అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాయి. చిన్నారి సమీపంలోకి రాగానే ఎటాక్ చేశాయి. హఠాత్తు పరిణామంతో ఆ చిన్నారి హడలిపోయింది. క్షణాల్లో 12 కుక్కలు గుంపుగా కలిసి ఆ బాలికపై దాడి చేశాయి. పదునైన కోరతలో బాలిక శరీర కండరాలను పీకాయి. భయంతో ఆ పసి ప్రాణం చేసిన ఆర్తనాదాలు విని స్థానికులు వచ్చారు. ఘటనను చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆ కుక్కలను అక్కడి నుండి తరిమేశారు. ఈ విషాద ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఇంట్లో పిల్లలు ఉంటే బీ కేర్ ఫుల్. ఒంటరిగా రోడ్డుపై వెళ్లే సందర్భాల్లో జాగ్రత్త వహించాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa