మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని చెబుతుంటారు. అది కొంతవరకు నిజమే అయినా వేసవిలో శరీరానికి సరైన పోషకాలను అందించే పండు మామిడి పండు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండుతో కలిగే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మామిడి పండు తినడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు ఉంటే తొలగిపోతాయి. దంతాలు శుభ్రపడుతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా మారుతుంది.
- మామిడి పండు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
- మామిడి పండ్లలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
- మామిడి పండులో ఉండే కాపర్ ఎర్రరక్త కణాల వృద్దికి దోహదపడుతుంది.
- మామిడి పండులో వుండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
- చర్మము ఆరోగ్యాన్ని పెంచడానికి మామిడిపండ్లు తోడ్పడుతాయి.
- మామిడి పండ్లు మెదడు ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తాయి.
- శృంగారంపై ఆసక్తి కోల్పోయిన వారిలో శృంగార వాంఛ రేకెత్తించడంలో మామిడి పండు ఉపయోగపడుతుంది.
- మామిడిపండులో బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa