ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం కొనసాగుతోంది. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 2,29,779.27 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించినట్లు బుగ్గన తెలిపారు. 2020-21తో పోలిస్తే వెనుకబడిన కులాలకు ఈ బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు చేసినట్లు చెప్పారు. అంతకుముందు ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలిపింది. స్పీకర్ సహా సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa