నమీబియాతో మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు మెరుగ్గా రాణించారు. జడేజా, అశ్విన్, బుమ్రా ధాటికి నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. జడేజా 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, అశ్విన్ 20 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.ఈ పోరులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. నమీబియా ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21), మైకేల్ వాన్ లింగెన్ (14) ఓ మోస్తరు ప్రదర్శన చేయగా, ఆల్ రౌండర్ డేవిడ్ వీజ్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో జాన్ ఫ్రైలింక్ (15 నాటౌట్), రూబెన్ ట్రంపుల్ మన్ (13) ఉపయుక్తమైన పరుగులు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa