మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. స్థానికంగా ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.ఆస్పత్రిలోని పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో పేషెంట్లు భయాందోళనకు గురయ్యారు.ప్రమాదం జరిగినప్పుడు ఆ వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 36 మంది పిల్లలు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం అందజేస్తామని తెలిపింది. అలాగే ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని మధ్యప్రదేశ్ సీఎం ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa