విశాఖ జిల్లా యలమంచిలి కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కశింకోట మండలం పల్లపు సోమవారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై యలమంచిలి తీర్థ మహోత్సవానికి వచ్చి, తిరిగి వెళ్తుండగా అర్థరాత్రి సమయంలో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa