న్యూఢిల్లీ: ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డే. హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజులు ఇవాళ ఢిల్లీలోని హాకీ స్టేడియంలో మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. స్పోర్ట్స్ కల్చర్‌తో పాటు క్రీడల్లో టెక్నాలజీ అన్న అంశంపై తమ అభిప్రాయాలను వినిపించారు. నేషనల్ స్పోర్ట్స్ ట్యాలెంట్ సెర్చ్ పోర్టల్ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను కూడా బహూకరించనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa