న్యూఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇవాళ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులు అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈసారి క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్నను హాకీ టీమ్ కెప్టెన్ సర్దార్ సింగ్, పారాలింపియన్ దేవేంద్ర జజరియా అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి పారా అథ్లెట్‌గా దేవేంద్ర నిలిచాడు. నలుగురికి ద్రోణాచార్య అవార్డులు లభించాయి. మొత్తం 17 మంది అర్జున అవార్డులు అందుకున్నారు. వీరిలో క్రికెటర్లు చెతేశ్వర్ పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa