నెల్లూరు: గూడూరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఆదిశంకర కాలేజ్ వద్ద బుధవారం ఉదయం అదుపుతప్పి కారు పల్టీ కొట్టింది. కారులో ఉన్న ప్రయాణీకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. తిరుపతి నుండి మార్టూరు వైపు వెళుతున్న కారులో నలుగురు ప్రయాణీకులున్నారు. సమాచారం అందిన వెంటనే గూడూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa