తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, సూలురు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa