ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం అయింది. ప్రమాద వివరాలను ప్రధాని మోడీకి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. మరి కాసేపట్లో ప్రమాదంపై రాజ్ నాథ్ సింగ్ స్టేట్ మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీని వెనుక ఏదైనా ఉగ్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదంలో గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్‌మెంట్ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa