తమిళనాడులోని కూనూరు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నారు. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ లో బిపిన్ రావత్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిపిన్ రావత్ సహా ఆయన భార్య ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa